Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్ గేట్స్ రాసలీలలు?? - అందుకే బోర్డు నుంచి తప్పుకున్నారా?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (09:05 IST)
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్‌ నెరిపిన రాసలీలలు తాజాగా చర్చనీయాంశమైంది. 
 
రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకోవడం కొసమెరుపు. 
 
వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన ఈ తాజా కథనం వివరాల్లోకి వెళ్తే.. 2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు ఓ లేఖ అందింది. బిల్‌గేట్స్‌ కొన్నేళ్లపాటు తనతో శారీరక సంబంధం నెరిపారంటూ మైక్రోసాఫ్ట్‌ మహిళా ఇంజనీరు ఒకరు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. 
 
దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించారు. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్‌ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకున్నారు. 
 
మరోవైపు ఇరవై ఏళ్ల నాటి ఈ వ్యవహారం సామరస్యంగానే పరిష్కారమైందని.. బోర్డు నుంచి వైదొలగడానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. 
 
మరోవైపు, తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ ఈనెల తొలినాళ్లలో ప్రకటించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, వీరిద్దరూ కలిసి ‘మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థను నడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments