Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీసీ రిపోర్టర్‌కు దేశబహిష్కరణ శిక్ష విధించిన ఉత్తరకొరియా

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:36 IST)
వార్తల సేకరణకు వచ్చిన బీబీసీ రిపోర్టర్‌ను ఉత్తరకొరియా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అంతేగాక.. ఆ రిపోర్టర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరకొరియాలో 36 ఏళ్ల తర్వాత గత శుక్రవారం అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీని కవరేజీ నిమిత్తం కొందరు నోబెల్‌ గ్రహీతలతో కలిసి ముగ్గురు సభ్యులతో కూడిన బీబీసీ బృందం కొద్దిరోజుల క్రితమే ఉత్తర కొరియాకు చేరుకుంది. 
 
ఈ సమావేశాలు ముగిసిన తర్వాత బీబీసీ రిపోర్టర్‌ రుపర్ట్‌ వింగ్‌ఫీల్డ్‌ హేస్‌‌తో పాటు.. మిగిలిన బృందం సభ్యులు తిరుగుపయనమయ్యారు. కానీ, వీరందరినీ ప్యాంగ్‌యాంగ్‌ ఎయిర్‌పోర్టులో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు రుపర్ట్‌ను విచారించినట్లు బీబీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినందుకు రుపర్ట్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments