Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసిస్ ఉగ్రవాదులపై సంకీర్ణ దళాలతో కలిసి యుద్ధం చేస్తున్న ప్రజలు... శ్మశానంలా అందమైన నగరం

తలలు తెగ నరకడం, పీకలు కోయడం, పీకలు కోసి పెద్దపెద్ద పాత్రల్లో రక్తం పట్టడం, తల - మొండాలను వేరు చేసి రోడ్లపై విసిరేయడం వంటి దారుణమైన శిక్షలకు కేరాఫ్ అడ్రెస్ ఐసిస్ ఉగ్రవాదులు. ఇరాక్ దేశంలో వారు ఒకప్పుడు అందమైన నగరంగా పేరుగాంచిన మోసుల్‌లో తిష్ట వేసుకుని

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (18:41 IST)
తలలు తెగ నరకడం, పీకలు కోయడం, పీకలు కోసి పెద్దపెద్ద పాత్రల్లో రక్తం పట్టడం, తల - మొండాలను వేరు చేసి రోడ్లపై విసిరేయడం వంటి దారుణమైన శిక్షలకు కేరాఫ్ అడ్రెస్ ఐసిస్ ఉగ్రవాదులు. ఇరాక్ దేశంలో వారు ఒకప్పుడు అందమైన నగరంగా పేరుగాంచిన మోసుల్‌లో తిష్ట వేసుకుని ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఇపుడా నగరం శ్మశానాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా శవాలు, శిథిలమైన భవనాలు దర్శనమిస్తున్నాయి. 
 
ఇరాక్‌లోని మోసుల్ నగరాన్ని అమెరికా, ఇరాక్ సేనల సారథ్యంలోని ప్రత్యేక బలగాలు తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ నగరంపై పట్టు సాధించిన ఇరాకీ సేనలకు... ఎన్నో నిజాలు తెలుస్తున్నాయి. మోసుల్ నగరంలో మంచి రహదార్లు, ఎత్తైన భవనాలు, వందల కోట్లలో వ్యాపారం జరిగేది. అలాంటి మోసుల్ నగరం, ఇప్పుడు శిథిలమైపోయి గత చరిత్రకు సాక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి కారణం గత 2014 నుంచి ఐఎస్ కబందహస్తాల్లో చిక్కకుని ఉండటమే. ఈ నగరం ఇపుడిపుడే సైన్యం వశవుతోంది.
 
అయితే, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ రక్షణ కోసం నగరం కింద మరో నగరాన్నే నిర్మించుకోవడం భద్రతాదళాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పెద్దపెద్ద బంకర్లలో భారీ ఎత్తున మందు పాతరలు ఉండటం, బంకర్లు ఎక్కడ ఉన్నాయన్న విషయమై సరైన సమాచారం లేకపోవడంతో మరిన్ని రోజుల పాటు మోసుల్ 'డెడ్లీ డేంజర్' అంటున్నారు నిపుణులు. 
 
మోసుల్ నగరాన్ని వశం చేసుకున్న తర్వాత ఇప్పటివరకూ ఆరు భారీ టన్నెల్స్ కనిపించాయి. గత మూడు రోజులుగా టన్నెల్స్ గుర్తించడమే సైన్యానికి ప్రధాన కర్తవ్యమైంది. గుర్తించిన టన్నెల్స్‌లో సకల సౌకర్యాలూ ఉన్నట్టు తెలుస్తోంది. గత వారాంతంలో సైన్యానికి, టన్నెల్స్‌లో దాగుండి విరుచుకుపడిన ఉగ్రవాదులకూ మధ్య తీవ్ర యుద్ధం జరిగిందని బ్రిగేడియర్ జనరల్ యహ్యా రసూల్ వెల్లడించారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments