Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే నా భార్య విడాకులు ఇస్తానంది : బరాక్ ఒబామా

వచ్చే నెలలో జరగబోయే అధ్యక్ష ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ మిగిలిన దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుండనడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు డెమోక్రటిక్ పా

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (17:17 IST)
వచ్చే నెలలో జరగబోయే అధ్యక్ష ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ మిగిలిన దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుండనడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున మొదటిసారి ఒక మహిళా అభ్యర్థి.. హిల్లరీ క్లింటన్ శ్వేత సౌధంలోకి ప్రథమ పౌరురాలిగా అడుగిడటానికి ప్రయత్నిస్తుండగా, మరొకవైపు కరుడుగట్టిన మితవాద భావాలు గల డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి) హిల్లరీ ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 
 
ప్రస్తుత అంచనాల ప్రకారం హిల్లరీ క్లింటన్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఎన్నికలపైనే ముమ్మరంగా చర్చ సాగుతోంది. ఒకపక్క రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మాత్రం విపరీతమైన వ్యతిరేకత వస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఓ టీషోలో పాల్గొని ఫన్నీ కామెంట్లు చేశారు. 
 
ఆ షోలో మాట్లాడుతూ... త‌న భార్య‌ మిషెల్‌ ఒబామాకు రాజకీయాలంటే ఇష్టం లేదని.. తాను మళ్లీ పోటీ చేస్తే త‌న భార్య తనకు విడాకులు ఇచ్చేస్తుంద‌న్నారు. అంతేకాకుండా... దేశ‌ చరిత్రలోనే ఒబామా చెత్త అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోతారంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒబామా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ''ట్రంప్ త‌న‌ను కనీసం అధ్యక్షుడిగానైనా దిగిపోతానని అన్నాడ‌ని చమత్కరించారు.

అంతేకాకుండా కాకుండా ట్రంప్‌పై పలు సంచలన వాఖ్యలు కూడా చేశాడు. చాలా సార్లు తాను ట్రంప్‌ను టీవీలో చూస్తూ నవ్వుకున్న‌ట్లు ఒబామా చెప్పారు. తాను నిద్ర‌పోతున్న స‌మ‌యంలోనూ చాలాసార్లు అత్యవసర ఫోన్‌ కాల్స్‌ తీసుకున్నానని... అయితే డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్ చేస్తే పగటిపూట కూడా స్పందన ఉండ‌ద‌ని కామెంట్ చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments