Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విలయం : సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:53 IST)
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తమ దేశ సరిహద్దులను మూసివేసింది. తద్వారా భారత్ నుంచి ఎలాంటి రాకపోకలు లేకుండా చేసింది. 
 
ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే విమాన రాకపోకలను నిలిపివేసిన బంగ్లాదేశ్.. తాజాగా భూ మార్గాన్ని కూడా మూసేస్తున్నట్టు ప్రకటించింది. 
 
భారత్‌తో ఉన్న భూ సరిహద్దును రెండు వారాలపాటు మూసేస్తున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ఆదివారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 (ఈ రోజు) నుంచే ఈ ఆదేశాలు అమలు రానున్నట్టు వెల్లడించారు. అయితే సరకు రవాణా వాహనాలను మాత్రం తమ దేశంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. మల్దీవులకు చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ కూడా సోమవారం కీలక ప్రకటన చేసింది. ‘భారతదేశం నుంచి మాల్దీవులకు వచ్చే పర్యాటకులు జనావాస ద్వీపాల్లోని పర్యటక కేంద్రాల్లో ఉండటాన్ని నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి’  అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments