Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్ మాయలోపడుతున్న ఆస్ట్రేలియా యువతులు

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (10:36 IST)
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆస్ట్రేలియా యువతులకు ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్న ఐఎస్ఐఎస్.. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా యువతులకు వల వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విక్టోరియా తీవ్రవాద నిరోధక దళం తెలియజేసింది. 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఆసీస్ అమ్మాయిలకు విలాసవంతమైన సౌకర్యాలతో జీవనం కల్పిస్తామని ఆశ చూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది.
 
గత రెండు నెలల వ్యవధిలో సుమారు 12 మంది ఆసీస్ యువతులు ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించారని, ఐదుగురు సిరియా వెళ్లారని, మరో నలుగురిని టర్కీలో అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. వీరంతా మెల్ బోర్న్ పరిసర ప్రాంతాలకు చెందిన వారని, వీరిని వివాహం చేసుకోవడమే ఉగ్రవాదుల లక్ష్యమని తెలిపింది. యువకులతో పోలిస్తే, యువతులను సులువుగా లొంగదీసుకోవచ్చన్నది ఐఎస్ ఉద్దేశమని వివరించింది. వీరి మాయలో పడుతున్న అమ్మాయిలు సిరియా, ఇరాక్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని తెలియజేసింది.
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments