Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ నాన్నా... నా శీలాన్ని పాడు చేయొద్దు... 13 యేళ్ళ బాలికపై తండ్రి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (08:37 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు తండ్రి అన్న పదానికే మచ్చతెచ్చాడు. కన్నకూతురిపైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ.. ఆమెకు నరకయాతన చూపించాడు. ఇలాంటి పాడుపని చేయొద్దని 13 ఏళ్ల ఆ బాలిక ఎంతగా ప్రాధేయపడ్డా కూడా. ఆ మానవమృగం ఏమాత్రం కనికరించకుండా మరింత హింసించాడు. 
 
అంతేకాకుండా గుర్తుతెలియని వారితోనూ బాలికపై అత్యాచారం చేయించి, ఆ దుర్మార్గాన్ని స్వయంగా వీడియో తీశాడు. కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన ఈ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు ఇరవై రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. తన బిడ్డను ఎవరన్నా చిన్న మాటంటేనే కన్న తండ్రికి రక్తం ఉడికిపోతుంది. 
 
అలాంటిది ఈ కామక్రూరుడు తాను అత్యాచారం చేయడమే కాకుండా ఆన్‌లైన్లో తనకు పరిచయమైన వారిని పిలిపించి.. వారు కూతురిని చిత్రహింసలు పెడుతుంటే... ఆనందంతో కేరింతలు కొడుతూ వీడియో తీశాడు. ఆ వీడియో తనకు వినోదాన్ని పంచిందంటూ పోలీసుల విచారణలో తన రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. 
 
2013 నుంచి 2015 మధ్య కుమార్తెపై జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులు నమోదుకాగా.. వాటిని ఆ నిందితుడు అంగీకరించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది వెల్లడించారు. 2013-15 మధ్యకాలంలో 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్న తన కూతురిపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు అంగీకరించాడు. 
 
బాధితురాలి పేరు రహస్యంగా ఉంచే ఉద్దేశంతో కోర్టు నిందితుడి పేరును వెల్లడించలేదు. 42 ఏళ్ల ఈ కామాందుడి దుశ్చర్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలనూ న్యాయమూర్తి కోర్టులో పరిశీలించారు. ఆ కూతురు తనపై అఘాయిత్యం చేస్తున్నప్పుడు  "వద్దు నాన్నా" అని జాలిగా వేడుకుంటూ ఉండటం చూసిన న్యాయమూర్తి ఫిలిప్ ఈటన్ తల్లడిల్లిపోయారు. ఈ కామాంధుడికి ఇంతకన్నా పెద్ద శిక్షే వేయాలనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామాంధుల్లో ఓ చర్చి పాస్టర్ కూడా ఉన్నాడు. అతనికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించి తీర్పునిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments