ఆస్ట్రేలియా పార్లమెంట్ వేదికగా మహిళపై అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:35 IST)
ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ వేదికగా ఓ మహిళపై అఘాయిత్యం జరిగింది. సమావేశానికి రమ్మని పిలిచిన సహ ఉద్యోగే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పిన ప్రధాని ఆమెకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాదాపు రెండేళ్ల క్రితం 2019 మార్చిలో పార్లమెంట్‌లోని రక్షణమంత్రి లిండా రెనాల్డ్‌ ఆఫీస్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ ఇటీవల వెల్లడించింది. 
 
ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. ఘటన గురించి ఆ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే తాను పోలీసులకు చెప్పానని, అయితే తన కెరీర్‌ను దెబ్బతీస్తారని భయపడి అధికారికంగా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. రెనాల్డ్‌ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ సిబ్బంది ఒకరు సమావేశం ఉందని పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. 
 
మహిళ వ్యాఖ్యలపై రక్షణమంత్రి రెనాల్డ్‌ స్పందిస్తూ.. అత్యాచారంపై పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే కేసు పెట్టకుండా తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని మహిళే స్వయంగా చెప్పారని అన్నారు. 
 
ఈ ఘటన గురించి తెలియగానే ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. బాధిత మహిళకు క్షమాపణలు తెలియజేశారు. ‘ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఘటనపై తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని మారిసన్‌ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments