Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సింగర్ ఆతిఫ్ శభాష్ అనిపించుకున్నాడు.. పాటను ఆపి యువతిని కాపాడాడు.. వీడియో

పాకిస్థాన్ గాయకుడు శభాష్ అనిపించుకున్నాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సెలెబ్రిటీలు నోటి మార వరకే పరిమితమవుతున్న తరుణంలో ప్రముఖ పాకిస్థానీ గాయకుడు ఆతిఫ్‌ అస్లాం.. తన కచేరీ కార్యక్రమంలో వేధింపులకు

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (16:34 IST)
పాకిస్థాన్ గాయకుడు శభాష్ అనిపించుకున్నాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై  సెలెబ్రిటీలు నోటి మార వరకే పరిమితమవుతున్న తరుణంలో ప్రముఖ పాకిస్థానీ గాయకుడు ఆతిఫ్‌ అస్లాం.. తన కచేరీ కార్యక్రమంలో వేధింపులకు గురవుతున్న ఓ యువతిని కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. 
 
శనివారం రాత్రి ఆతిఫ్ కరాచీ ఈట్ 2017 కచేరీలో పాల్గొన్నాడు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించాడు. అయితే కళ్ల ముందే ఓ యువతిని కొందరు యువకులు వేధిస్తుండడం చూశాడు. ఇక పాటను ఆపేయాల్సిందిగా ఆర్కెస్ట్రాకు చేతిలో సైగ చేశాడు. ఫలితంగా పాట మధ్యలోనే ఆగిపోయింది.
 
అందరి ముందే వేధిస్తున్న యువకులను 'మీరెప్పుడూ అమ్మాయిని చూడలేదా? మీ అమ్మ కానీ, అక్క కానీ ఇక్కడే ఉండొచ్చు' అంటూ చెడామడా తిట్టి వెనకే ఉన్న బౌన్సర్లను పిలిపించి యువతిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేశాడు. ఈ విషయమై ఈవెంట్‌ నిర్వాహకులు ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫలితంగా ఆతిఫ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.
 
</iframe

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments