Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ రెస్టారెంట్ ఐఎస్ఐఎస్ నరమేధం... 74 మంది హతం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో 74 మంది మృతిచెందగా, మరో 91 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో పరిస్థితి భీతావహంగా ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments