Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు... అంగీకరించిన ఆస్ట్రాజెనెకా!!

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (10:39 IST)
కరోనా టీకాల్లో ఒకటైన కోవిషీల్డ్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఉన్నాయని ఆ టీకాను ఉత్పత్తి చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి ఈ కంపెనీ కోవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసింది. అయితే, ఈ టీకాను తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించింది. ఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపింది. 
 
ముఖ్యంగా, కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. చాలా అరుదుగా టీటీఎస్‌కు కారణమవుతున్నట్టు తెలిపింది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవడం వంటి సమస్యలు తెలెత్తుతాయి. కోవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా... టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది. 
 
కాగా, ఈ టీకా ఒకరి మృతికి కారణం కాకపోవడంతో పాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్టు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ అనే వ్యక్తి హైకోర్టుకెక్కాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోబోతున్నట్టు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments