Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈకి చేరిన ఆష్రఫ్ ఘని - మానవతాదృక్పథంతోనే ఆశ్రయం కల్పించాం.

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (11:31 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రదాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం విడిచిపారిపోయాడు. ప్రస్తుతం ఆయన యూఏఈలో తలదాచుకుంటున్నారు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు. 
 
ఘనీకి, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించడానికి అంగీకరించామని యూఏఈ బుధవారం తెలిపింది. అయితే, యూఏఈలో ఆయన ఎక్కడ ఉన్నదీ మాత్రం వెల్లడించలేదు.
 
మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్‌ చేతుల్లోకి వెళ్లి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్ల నిండా భారీ నగదుతో దేశం నుంచి పరారయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తొలిసారిగా దీనిపై వివరణ ఇచ్చారు. 
 
తాను డబ్బుతో పరారైనట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాలిబన్లు వస్తున్నారని, వెంటనే వెళ్లిపోవాలని తన భద్రతా విభాగం కోరిందని, కనీసం బూట్లను మార్చుకునే సమయం కూడా లేదన్నారు. మరోవైపు మాతృదేశాన్ని అమ్మేసి పారిపోయిన ఘనీని అరెస్ట్‌ చేయాలని ఆ దేశ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్‌ ఇంటర్‌పోల్‌ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

మాజీ ప్రియురాలిని మరవలేకపోతున్నా.. ఆర్థిక ఒత్తిడిలో కూడా ఉన్నాను.. డైనింగ్ ఏరియాలో ఉరేసుకుని..?

Chiru: భారతీయుడికి గర్వకారణమైన క్షణం : చిరంజీవి, మోహన్ లాల్, నిఖిల్

Prabhas : రాజా సాబ్ లో సంజయ్ దత్ హైలైట్ కాబోతున్నాడా..

Ram Charan :పెద్ది నుంచి రామ్ చరణ్ బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

తర్వాతి కథనం
Show comments