Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమాస్ సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తాం!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:33 IST)
గాజాలో హమాస్ సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి తీరుతామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఈ సొరంగ మార్గాన్ని ధ్వంసం చేస్తామని సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో గత 24 రోజులుగా సాగిస్తున్న తన దాడులను మరింత విస్తృతం చేయడానికి ఇప్పుడున్న సైనికులకు తోడుగా అదనంగా మరో 16 వేల సైనికులను సంసిద్ధం చేసింది. 
 
గత 24 రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 1374 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందడం తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. 
 
తమ భూభాగంలోకి చొరబడడం కోసం హమాస్ నిర్మించిన అన్ని సొరంగ మార్గాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేసారు. తాము ఇప్పటికే డజన్ల సంఖ్యలో సొరంగ మార్గాలను ధ్వంసం చేసామని, కాల్పుల విరమణతో సంబంధం లేకుండా మిగతా సొరంగ మార్గాలన్నిటినీ ధ్వంసం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేసారు. 
 
అంతేకాదు ఇజ్రాయెల్ సైన్యాలు వేల సంఖ్యలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసాయని, వందలమంది టెర్రరిస్టులను హతమార్చాయని కూడా ఆయన చెప్పారు. ఈ క్లిష్టసమయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments