Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

ఐవీఆర్
శుక్రవారం, 30 మే 2025 (15:56 IST)
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. భారతదేశంలో యాపిల్ ఫోన్ల తయారీ వద్దని ట్రంప్ వారిస్తున్నా టిమ్ కుక్ అస్సలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికే తొలిదఫా కర్నాటకలోని దేవనహల్లిలో యాపిల్ తయారీ ప్లాంట్ కోసం రూ. 3000 కోట్లు ఖర్చు చేసేసారు.
 
ఇప్పుడు అదే ఊపుతో ప్లాంటుకి అనుబంధంగా 300 ఎకరాల్లో ఉద్యోగుల కోసం హాస్టళ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 23 కిలోమీటర్ల దూరంలో వుంది. ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తైన నేపధ్యంలో వచ్చే డిశెంబరు నాటికి ఇక్కడ నుంచి లక్ష ఐఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
మరోవైపు ఉద్యోగుల కోసం నిర్మించే హాస్టళ్లు ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని చెబుతున్నారు. 30 వేల మంది ఉద్యోగుల్లో 80 శాతం వరకూ అంతా మహిళా ఉద్యోగులకే ఈ హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఐ-ఫోన్ల తయారీని ఎంచుకోవడంతో కంపెనీకి కనీసం 1.7 లక్షల కోట్లు లాభాలు వచ్చే అవకాశం వున్నట్లు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments