Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానస్పద మృతి

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:41 IST)
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. అమెరికాలోని పనామాలోని ఓ హోటళ్లోని స్విమ్మింగ్ ఫూల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 
 
మృతుడు ప్రకాశం జిల్లాలోని కంబం మండలంలోని రావిపాడుకు చెందిన సిహెచ్ సాయికృష్ణగా గుర్తించారు. సాయికృష్ణ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికాలోని హూస్టన్ యూనివర్సిటీలో చేరాడు.
 
కాగా, అతని కుటుంబసభ్యులు కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి మృతుడి అంకుల్, 
 
హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. విహార యాత్ర కోసం పనామా వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్కాన్సాలో ఉంటున్న తమ బంధువులు సాయికృష్ణ మృతి విషయాన్ని చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు.
 
అక్కడి పోలీసులు సాయికృష్ణ మృతదేహాన్ని స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటికి తీసినట్లు తెలిపారని చెప్పారు. అయితే ఘటన ఎలా జరిగిందనే విషయం మాత్రం తమకు తెలియరాలేదని చెప్పారు. కాగా, మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments