Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకూ డోనాల్డ్ ట్రంప్‌కు అఫైర్ ఉందా : నిక్కీహేలీ ఏమంటున్నారు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీకి అఫైర్‌ ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై హేలీ స్పందించారు. ట్రంప్‌తో అఫైర్‌ అని వ్యాఖ్యలు చేయడం చాలా అస

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (11:39 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీకి అఫైర్‌ ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై హేలీ స్పందించారు. ట్రంప్‌తో అఫైర్‌ అని వ్యాఖ్యలు చేయడం చాలా అసహ్యంగా ఉందన్నారు. 
 
మైకేల్‌ ఊల్ఫ్‌ రాసిన ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్‌తో నిక్కీకి అఫైర్‌ ఉందని రాయడంతో ఈ వదంతులు వ్యాపించాయి. ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్‌ విమానంలో, ఓవల్‌ కార్యాలయంలో నిక్కీ చాలా సేపు ఒంటరిగా గడిపారని ఊల్ఫ్‌ పుస్తకంలో రాశారు. ఇది పూర్తిగా అబద్ధమని, చాలా అసహ్యంగా, అసభ్యంగా రాశారని నిక్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో తాను ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారని తెలిపారు. అలాగే ఓవల్‌ కార్యాలయంలో కూడా ట్రంప్‌తో తన రాజకీయ భవిష్యత్తు గురించే మాట్లాడానని, ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని, అలాగే తాను ఎప్పుడూ అధ్యక్షుడితో ఒంటరిగా లేనని స్పష్టంచేశారు. 
 
ఎక్కువ శాతం మంది పురుషులు మహిళల్ని గౌరవిస్తున్నారు.. కొంతమందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని హేలీ అన్నారు. బలమైన వ్యక్తిత్వమున్న మహిళలను హేళన చేయడం అంత సులువు కాదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments