Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది న్యూయార్క్ టైమ్స్' ఫోటో జర్నలిస్టును చంపేసిన రష్యా బలగాలు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (09:21 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలు సామాన్య ప్రజలతో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులపట్ల కూడా ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. రష్యా బలగాలు జరిపిన దాడిలో 'ది న్యూయార్క్ టైమ్స్‌'కు చెందిన ఫోటో జర్నలిస్టును చంపేశాయి. రష్యా సేనలు చేసిన దాడిలో బ్రెంట్ రెనాడ్ (51) అనే ఫోటో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
రష్యా బలగాలు కాల్పులు జరిపిన సమయంలో రెనాడ్ తన సహచరులతో కలిసి ఓ ట్రక్కులో దాగివున్నాడు. ఉక్రెయిన్ శరణార్ధులు సరిహద్దులను దాటుతుండగా ఓ పాత్రికేయ బృందం ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నాయి. అపుడు రష్యా బలగాలు విచ్చలవిడిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో రెనాడ్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
రెనాడ్ మృతదేహంపై ఉన్న మీడియా బ్యాడ్జ్‌ను పరిశీలించిన అధికారులు అతడు 'ది న్యూయార్క్ టైమ్స్' ఫోటో జర్నలిస్టుగా గుర్తించారు. అయితే, దీనిపై న్యూయార్క్ టైమ్స్ వివరణ ఇచ్చింది. బ్రెంట్ రెనాడ్ గతంలో తమ సంస్థలో పనిచేశాడని, ప్రస్తుత అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నాడని, ఓ అసైన్మెంట్ కోసం ఉక్రెయిన్ వచ్చినట్టు తెలిసిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments