Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నికి ఆస్తి బుగ్గిపాలు.. కన్యత్వాన్ని వేలానికి పెట్టిన 20 ఏళ్ల యువతి... 4 లక్షల డాలర్లకు బిడ్

అప్పటివరకు రిచ్ లైఫ్‌ను అనుభవించిన ఆ కుటుంబం... ఓ చిన్నపాటి అగ్నిప్రమాదం వారి జీవితాలను రోడ్డుపాల్జేసింది. దీంతో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే ఆన్‌లైన్‌లో వేలానికి పెట్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:55 IST)
అప్పటివరకు రిచ్ లైఫ్‌ను అనుభవించిన ఆ కుటుంబం... ఓ చిన్నపాటి అగ్నిప్రమాదం వారి జీవితాలను రోడ్డుపాల్జేసింది. దీంతో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. ఆ యువతి పేరు కేథరిన్ స్టోన్. దేశం అమెరికా. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
2014లో సియాటెల్ సిటీలో ఉన్న కేథరిన్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్తులు, విలువైన సామాగ్రి అంతా ఆహుతైంది. ఈ ఘటనతో, అప్పటిదాకా హాయిగా బతికిన ఆ కుటుంబం... రోడ్డున పడింది. రోజులు గడవడం కూడా కష్టమైంది. తన కుటుంబ సభ్యులు పడుతున్న దీన స్థితిని, వేదనను చూసి కేథరిన్ చలించిపోయింది. 
 
ప్రతి రోజూ కుటుంబ పోషణ భారమై పోయింది. దీంతో, తన కన్యత్వాన్నే ఆన్‌లైన్‌లో పెట్టాలనుకుంది. వెంటనే, నెవడాలో వ్యభిచారాన్ని నిర్వహించే డెన్నిస్ హాఫ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి, తన మనసులోని ఆలోచనను అతనికి చెప్పింది. దీంతో, ఆమె గురించి ఆన్‌లైన్‌లో అతను ప్రకటన ఇచ్చాడు. ఇప్పటివరకు నాలుగు లక్షల డాలర్లకు ఓ బిడ్ వచ్చిందని కేథరిన్ తెలిపింది. తన వారి కష్టాలు తీరిన తర్వాత, న్యాయవాద కోర్సును చేస్తానని ఆమె తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం