ఆమెపై చాలా రోజుల నుంచి మోజుపడ్డా... అందుకే నమ్మించి రేప్ చేశా...

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:46 IST)
మతం ముసుగులో అనేక మంది మత పెద్దలు ఎన్నో దారుణాలు చేస్తున్నారు. తాజాగా క్రైస్తవ మతపెద్ద పోప్ కొందరు క్రైస్తవ మతపెద్దలు నన్స్‌ను శృంగార బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవలి బయటికి వచ్చిన ఓ సర్వే ప్రకారం నార్త్ అమెరికాలో దాదాపు 500 మంది క్రైస్తవ సన్యాసినులు లైంగిక దాడికి గురైనట్లు తెలిసింది. తాజాగా అమెరికాలో భక్తురాలిపై అఘాయిత్యం చేసిన మతప్రబోధకుడి వ్యవహారం బయటికి వచ్చింది.
 
అమెరికాలోని మియామీ నగరంలో సేక్ర్‌డ్ హార్డ్ అనే క్యాథలిక్ చర్చిలో జీన్ ఫిలిప్ అనే వ్యక్తి మత ప్రబోధకుడిగా ఉన్నాడు. సేక్ర్‌డ్ హార్డ్ చర్చికి తరచుగా వచ్చే ఒక మహిళతో ఫిలిప్ పరిచయం పెంచుకున్నాడు. తన ఇంటికి వస్తే పాప ప్రక్షాళన చేస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఆ యువతి అతని ఇంటికి వెళ్లింది. ఆమెను ఆహ్వానించిన ఫిలిప్ ఆమెకు తాగేందుకు టీ ఇచ్చాడు. టీ తాగిన యువతి మైకంతో పడిపోయింది. ఆ తర్వాత రెండు గంటల తర్వాత మెలకువ వచ్చి చూడగా ఆమె నగ్నంగా బెడ్‌పై పడి ఉంది. అయితే తనపై అత్యాచారం జరిగిందో లేదో కూడా ఆ యువతికి తెలియదని చెప్పింది.
 
అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలా వద్దా అని తనలో తానే మధనపడిపోయిన ఆమె రెండు వారాల తర్వాత ఇతర మత ప్రబోధకులకు చెప్పింది. వారు ఇచ్చిన సలహా ప్రకారం ఆమె ఫిలిప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిలిప్‌ను అరెస్ట్ చేయగా అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఆమెపై చాలా రోజులుగా మోజు పడ్డానని, అందుకే ఆమెను ఇంటికి పిలిపించి టీలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసానని ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం