Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగను పట్టుకోబోయి.. రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన అమెరికా మహిళ!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (09:33 IST)
అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన భుజానికి తగిలించుకునివున్న హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వెళుతున్న దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఆమె పెట్టిన కేకలు స్థానికుల్లో కదలిక తెచ్చి.. దొంగను పట్టుకునేలా చేశాయి. 
 
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే ఇటీవల మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ సిటీలో నిండు గర్భిణీ అయిన ఓ మహిళ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నుక్కుని... కార్లో వాటిని పెడుతుండగా... ఓ అగంతుకుడు ఆమె భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌ను కాజేసి ఉడాయించబోయాడు. వెంటనే తేరుకున్న ఆమె పరుగు పెట్టి అతన్ని పట్టుకోబోయింది. దీంతో దొంగ ఆమెను బలంగా నెట్టివేసి దౌడు తీశాడు. ఈ హఠాత్ పరిణామంతో, ఆమె గట్టిగా గావు కేకలు వేయడం ప్రారంభించింది. అదేసమయంలో, ఆమెకు నొప్పులు రావడం... డెలివరీ అవడం నిమిషాల్లో జరిగిపోయాయి. 
 
మహిళ అరుపులు విన్న స్థానికులు దొంగను పట్టుకున్నారు. నార్మల్ డెలివరీ అవడంతో పాటు... సిజేరియన్ చేయించుకునే కష్టం తప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. దీంతో పాటు, చేజారిపోయిందనుకున్న పర్స్ మళ్లీ చేతికి అందడం మరింత సంతోషాన్నిస్తోందని చెప్పింది. దొంగను స్థానికులు పోలీసులకి అప్పజెప్పారు. అతనిని 'మార్క్ న్యూటన్'‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments