Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లీమేతర మహిళలను రేప్ చేసేందుకు అల్లా సమ్మతిస్తాడు : ఇస్లామిక్ ప్రొఫెసర్

Webdunia
మంగళవారం, 19 జనవరి 2016 (10:53 IST)
ఈజిప్టుకు చెందిన ఓ ఇస్లామిక్ మహిళా ప్రొఫెసర్ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లీమేతర మహిళలను అత్యాచారం చేసేందుకు ముస్లిం పురుషులకు అల్లా అనుమతిచ్చారని పేర్కొంది. కైరోకు చెందిన అల్ అజర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సువాద్ సలేహ్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్‌లా స్ప్రెడ్ అవుతున్నాయి. 
 
ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూడొచ్చనన్నారు. అయితే, అది ఒకసారికి మాత్రమే పరిమితమని చెప్పంది. ఇజ్రాయేల్ వంటి శత్రువులపై చేసే యుద్ధంలో భాగంగా ఆ దేశ మహిళలను ఏమైనా చేయవచ్చని చెప్పింది. సదరు ముస్లీమేతర మహిళలను ముస్లింలు తమ భార్యలతో సెక్స్‌లో పాల్గొన్నట్లుగానే ముస్లీమేతర మహిళలతో పాల్గొనవచ్చునని పేర్కొంది. 
 
బానిస మహిళలతో శృంగారం జరపొచ్చని చెప్పింది. ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంది. ఆమె వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిని పలువురు ముస్లింలు కూడా ఖండిస్తున్నారు. ఇస్లాం సాగుతున్న తప్పుడు ప్రచారంలో ఇది ఓ భాగమని ముస్లిం మతపెద్దలు అభిప్రాయపడుతున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు