గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయేల్ దాడి.. ఒకే కుటుంబం-19 మంది మృతి

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (20:32 IST)
గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడిలో ఓ కుటుంబానికి చెందిన 19 మందిని హతమార్చారు.
 
తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8 మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, అతని సోదరుడి భార్య, నలుగురు పిల్లలు, అతని కోడలు, మామ మరణించారని అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది.
 
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు జరిగిన ప్రదేశంలో పాలస్తీనియన్లు క్షతగాత్రుల కోసం వెతుకుతున్నారు. గాజా స్ట్రిప్‌లోని జనసాంద్రత కలిగిన జబాలియా శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది మహ్మద్ అబూ అల్-కుమ్సన్ 19 మంది కుటుంబ సభ్యులు మరణించారని అల్ జజీరా బుధవారం నివేదించింది.
 
ఈ దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు, హమాస్ కమాండర్ మరణించినట్లు భావిస్తున్నారు. అల్ జజీరా తన టీవీ ఇంజనీర్ మహ్మద్ అబు అల్ కుమ్సాన్ కుటుంబంలోని 19 మందిని చంపిన ఇజ్రాయెల్ బాంబు దాడిని హేయమైన చర్యగా ఖండించింది. పౌరులపై దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అల్ జజీరా నొక్కి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments