Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడాల్ఫ్ హిట్లర్ టాయిలెట్ సీట్ వేలం.. న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ కూడా..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (20:29 IST)
AdolfHitler
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకరు. యుద్ధం ముగిసే సమయంలో తనను కాల్చుకొని హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన గదిలో ఓ టాయిలెట్ ఉండేది. ఆ టాయిలెట్ సీట్‌ను రాంగ్ వాల్డ్ సి బోర్చ్ అనే అమెరికన్ సైనికుడు దొంగిలించాడు. 
 
ఈ టాయిలెట్ సీట్ ను ఫిబ్రవరి 8న మేరీల్యాండ్‌లో వేలం వేస్తారు. వేలంలో ప్రారంభ ధారగా 5000 డాలర్లుగా నిర్ణయించారు. దాదాపుగా 15000 డాలర్లకు ఈ టాయిలెట్ సీట్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ టాయిలెట్ సీటుపై హిట్లర్‌కు సంబంధించిన ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా ఉంచడం విశేషం.
 
కాగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన సమయంలో సైనికుడు ఆ టాయిలెట్ సీట్‌ను దొంగిలించాడు. ఆ తరువాత అక్కడి నుంచి దానిని న్యూయార్క్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. 
 
ఇప్పటి‌వరకు ఆ సీట్ తన వద్దే ఉంచుకున్నారు. ఇప్పటికే ఈ టాయిలెట్ సీటు వాళ్ల ఇంట్లోనే భద్రంగా ఉంది. ఇప్పుడా సైనికుడి కుటుంబ సభ్యులే దీనిని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments