Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు నాడే ఆమె అందాన్ని చిదిమేసిన దుండగుడు... లండన్‌లో దారుణం...

లండన్‌లో పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు ఎంతో సరదాగా తన కజిన్ తో కలిసి కారులో వెళుతున్న 21 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు యాసిడ్ దాడి చేసి ఆమె అందాన్ని చిదిమేసిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... 21 ఏళ్ల రేషమ్ ఖాన్ బిజినెస్ మేనెజ్మెంట్ విద్యార్థిని.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (21:27 IST)
లండన్‌లో పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు ఎంతో సరదాగా తన కజిన్ తో కలిసి కారులో వెళుతున్న 21 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు యాసిడ్ దాడి చేసి ఆమె అందాన్ని చిదిమేసిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... 21 ఏళ్ల రేషమ్ ఖాన్ బిజినెస్ మేనెజ్మెంట్ విద్యార్థిని. 
 
తనకు 20 ఏళ్లు నిండి 21వ ఏటలో అడుగిడుతున్న సందర్భంగా తన కజిన్ జమీల్ ముక్తార్‌తో కలిసి పుట్టినరోజు పండుగ చేసుకోవాలని తూర్పు లండన్లోని బెక్టన్ నుంచి అతడితో కారులో బయలుదేరింది. దారిలో రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. ఆ ప్రక్కనే అప్పటికే పొంచి వున్న ఓ దుండగుడు యాసిడ్ బాటిల్‌తో వారి వద్దకు వచ్చి ఇద్దరిపై పోసేసి పరారయ్యాడు. 
 
ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా నడిపినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరికీ యాసిడ్ అంటుకోవడంతో కారు నుంచి కిందికి బట్టలు విప్పి హెల్ప్ హెల్ప్ అంటూ ఆర్తనాదాలు చేశారు. ఐతే 45 నిమిషాల పాటు వారిని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ వ్యక్తి ముందుకు వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ యువతికి మెడ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జూన్ 21న జరుగ్గా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments