భర్త మరణవార్తనే చదివిన న్యూస్ రీడర్ ఎక్కడ? గోర్లు గిల్లుకుంటూ దొరికిపోయిన నటాషా ఎక్కడ?
భర్త మరణించారనే విషయాన్ని తెలుసుకుని తన వృత్తిపట్ల అంకిత భావాన్ని ప్రదర్శించిన న్యూస్ రీడర్ సంగతి గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐబీసీ-24 ఛానెల్ న్యూస్ రీడర్ సుప్రీత్
భర్త మరణించారనే విషయాన్ని తెలుసుకుని తన వృత్తిపట్ల అంకిత భావాన్ని ప్రదర్శించిన న్యూస్ రీడర్ సంగతి గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐబీసీ-24 ఛానెల్ న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్.. నిబ్బరంగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగానే న్యూస్ చదువుతున్న ఆమెకు.. ఓ విషాదకర వార్త బులెటిన్ లిస్ట్‌లో పైకి వచ్చింది.
మహసాముండ్ జిల్లా పిథారా ప్రాంతంలో జాతీయ రహదారిపై రెనో డస్టర్ కారు గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదానికి గురైన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మరణించారని.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ న్యూస్ రీడర్ చదివారు.
ఇదే మార్గంలో తన భర్త హర్షద్ కవాడే రెనో డస్టర్ కారులో వెళ్తున్నాడు. ఇంకా ప్రమాదానికి గురైన కారు తన భర్తదేనని గుర్తించి.. దుఃఖం బయటకు కనిపించకుండా మామూలుగానే వార్తను చదివేసింది. అలా బులెటిన్ పూర్తి అయ్యే వరకు… వార్తలు చదివి.. ఆ తర్వాత ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు. అయితే గతంలోనూ ఓ విషాధ ఘటన చదువుతూ చిరునవ్వు నవ్విన ఏబీసీ 24 చానెల్‌కు చెందిన నటాషా.. మళ్లీ వార్తల్లోకెక్కారు.
ఈసారి నటాషా గోర్లు గిల్లుకుంటూ దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చేస్తూ అందరినీ నవ్విస్తోంది. తాను లైవ్‌లో ఉన్న విషయాన్ని మరచిపోయి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. అయితే, ఒక్కసారిగా కెమెరా ఆన్ అయిందన్న విషయాన్ని తెలుసుకొని ఉలిక్కిపడింది. వెంటనే కవర్ చేస్తూ స్పోర్ట్స్ న్యూస్ చూద్దామంటూ బులిటెన్‌ను కొనసాగించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.