అత్తపై కోపం దుత్తపై చూపించినట్లు.. భర్తపై కోపాన్ని కుమారుడిపై చూపింది.. ఉరేసి? (వీడియో)

థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ భర్తను తన కుమారుని వంకతో బెదిరించింది. భర్త ఇంటికి రాకపోవడంతో నీ బాబు బతకాలంటే ఇంటికి త్వరగా రావాలని.. లేకుంటే చంపేస్తానని కోపంగా మాట్లాడుతూ.. ఓ వీడియోను భర్తకు పోస్టు చేసి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (17:35 IST)
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ భర్తను తన కుమారుని వంకతో బెదిరించింది. భర్త ఇంటికి రాకపోవడంతో నీ బాబు బతకాలంటే ఇంటికి త్వరగా రావాలని.. లేకుంటే చంపేస్తానని కోపంగా మాట్లాడుతూ.. ఓ వీడియోను భర్తకు పోస్టు చేసింది. ఈ వీడియోతో భయపడిన భర్త.. వెంటనే దాన్ని చెల్లికి పంపించాడు. ఆమె పోలీసుల స‌హాయం కోరుతూ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.
 
వివరాల్లోకి వెళితే  థాయ్‌లాండ్‌కు చెందిన నారేమున్ జంప‌సెర్టు. ఈమెకు భర్తతో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఎంతసేపటికీ ఫోను తీయకపోవడంతో తన కుమారుడికి ఉరేసి, చంపేస్తాన‌ని బెదిరిస్తూ వీడియో తీసి పంపింది. ఈ వీడియో పోలీసుల వద్దకు వెళ్ళడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యలు,  భర్త మీద అనుమానంతో తాను క్షణికావేశంలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పింది. 
 
కన్నబిడ్డను చంపేంత కిరాతకురాలిని కాదని.. అది కేవలం బెదిరింపు మాత్రమేనని.. నిజానికి తాను చ‌నిపోవాల‌నుకున్నాన‌ని, తర్వాత బాబు వంక‌తో బెదిరించిన‌ట్లు నారేమున్ చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments