సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

సెల్వి
బుధవారం, 19 నవంబరు 2025 (10:23 IST)
Indian Woman
సిడ్నీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ప్రమాదానికి గురైన మహిళ ఎనిమిది నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అటువైపుగా ఓవచ్చిన ఓ కియా కార్నివాల్ కారు డ్రైవర్ వారికి దారి ఇచ్చేందుకు వేగాన్ని తగ్గించారు. 
 
సరిగ్గా అదే సమయంలో, వెనుకవైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఒక బీఎండబ్ల్యూ సెడాన్, కియా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కియా కారు అమాంతం ముందుకు దూసుకుపోయి, రోడ్డు దాటుతున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. 
 
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ మరణించారు. అయితే కియా కార్నివాల్ నడుపుతున్న 48 ఏళ్ల వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ  కారును నడుపుతున్న ఆరోన్ పాపజోగ్లూ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం