Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి సబ్బంది కిడ్నాప్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:08 IST)
అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న యెమెన్ దేశంలో ఆ దేశ పౌరులతో పాటు విదేశీ ప్రతినిధులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఓ మిషన్ కోసం ఈ సిబ్బంది సౌత్ యెమెన్ దేశంలో గత పని చేస్తున్నారు. 
 
ఈ పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దండుగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్టు యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి రస్సెల్ గీకీ వెల్లడించారు. 
 
కాగా, యెమెన్ దేశంలో గత 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూపునకు మధ్య తీవ్ర పోరు సాగుతోంది. గత 2015లో యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు కూల్చవేశారు కూడా. అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments