Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు కలకలం.. దండుగుల చేతిలో ఐదుగురి హతం

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (13:49 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. ప్యూర్టోరికోలో కొంతమంది దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
ప్యూర్టో రికోలోని ప్యూర్టో రికన్ బార్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని తెలిపారు.
 
బాధితులందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కాటానో పట్టణ మాజీ మేయర్ సోదరుడు కూడా ఉన్నాడని తెలిపారు. కాగా ఈ కాల్పుల ఘటన డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడినదని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 
 
ఈ ప్రాంతంలో డ్రగ్స్ రవాణా జరుగుతున్నప్పటికీ కాల్పులు చోటుచేసుకోవడం అసాధారణ ఘటనగా పోలీసులు అభివర్ణించారు. కాల్పుల్లో చనిపోయిన ఓ 35 ఏళ్ల వ్యక్తిని డ్రగ్స్ వ్యాపారిగా అనుమానిస్తున్నామని, అతడిని లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇదిలావుంచితే.. ప్యూర్టో రికో ద్వీపంలో సాధారణంగా క్రైమ్ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఈ యేడాది ఆ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 
 
ఈ సంవత్సరం ఇప్పటికే 74 హత్యలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలోనే సెయిబా పట్టణంలో డ్రగ్స్ సంబంధిత దాడి జరిగింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments