శ్రీలంకకు చేయూతనిచ్చిన భారత్... అప్పుగా 40 వేల టన్నుల డీజిల్‌

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (12:55 IST)
శ్రీలంకకు భారత్ చేయూతనిచ్చింది. ఇంధన కొరతతో నానా తంటాలు పడుతున్న శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ను అప్పుగా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది. దీనిని సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. 
 
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ.. ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
శ్రీలంక రవాణారంగంలో బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటికి సరిపడా డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. 
 
దీంతో రాజపక్స ప్రభుత్వం భారత్‌ సాయం కోరింది. కాగా, దేశంలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments