Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీలో ఘాతుకం : తండ్రితో సహా ఇంట్లో ఉంటున్న వారిని కాల్చి చంపిన కుమారుడు...

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (09:13 IST)
అమెరికాలో మరోమారు కాల్పుల మోత వినిపించింది. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా మరో ముగ్గురు సన్నిహుతులు ఉన్నారు. పైగా, ఈ కాల్పులకు పాల్పడింది ఆ ఇంటి యజమాని కుమారుడు కావడం గమనార్హం. పైగా, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అమెరికాలోని ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. 
 
ఈ కాల్పుల ఘటనను పరిశీలిస్తే, బర్త్ డే పార్టీలో 21 యేళ్ల ఇంటి యజమాని కుమారుడు తుపాకీతో మారణహోమం సృష్టించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా అప్పటికే నలుగురు చనిపోయివున్నారు. మరికొందు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కన్నుగప్పి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించి, అతడు నడుపుతున్న కారు ఓ లోయలో పడిపోయింది. ఆ తర్వాత తనను తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణానికి పాల్పడింది ఇంటి యజమాని కుమారుడు కావడం గమనార్హం. తాను జరిపిన కాల్పుల్లో తండ్రితో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో పోలీసుల భయంతో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments