Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 మంది చైనా విద్యార్థులకు స్వైన్ ఫ్లూ

Webdunia
దక్షిణ చైనాలో ఏకంగా 30 మంది విద్యార్థులకు ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి సోకడంతో వారు చదువుతున్న పాఠశాలను మూసివేశారు. ఈ విద్యార్థులను ఏ (హెచ్1ఎన్1) ఫ్లూ వైరస్ సోకిన కారణంగా జబ్బున పడినట్లు అధికారిక యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఆసియా- ఫసిఫిక్ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గువాన్‌డోంగ్ ప్రావీన్స్‌లోని డోంగ్వాన్ నగరంలో ఉన్న షైపై టౌన్‌షిప్ సెంట్రల్ ప్రైమరీ పాఠశాలలో గత బుధవారం ఆరుగురు విద్యార్థులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వచ్చాయి. శుక్రవారం వారికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు.

అయితే ఇదే వారంలో మరో 24 మంది విద్యార్థులు ఈ వైరస్ కారణంగా జబ్బున పడ్డారని, వారికి ఆదివారం స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయినట్లు చైనా అధికారిక యంత్రాంగం తెలిపింది. జబ్బునపడిన అందరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వారందరూ స్వల్ప అనారోగ్యంతోనే బాధపడుతున్నారు.

ముందుజాగ్రత్త చర్యగా వారు చదువుతున్న పాఠశాలను వారంపాటు మూసివేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1314 మంది విద్యార్థులను చదువుతున్నారు. చైనాలో ఆదివారం 58 మంది పౌరులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 414కి చేరింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments