Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అల్లకల్లోలం సృష్టించండి : సరిహద్దుల్లో ఉగ్రమూకలకు సయీద్ పిలుపు

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (13:01 IST)
భారత్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ సరిహద్దుల్లో ఉగ్రమూకలకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఈ కరుడుగట్టిన తీవ్రవాది ఇండో - పాక్ సరిహద్దుల్లో యధేచ్చగా తిరుగుతున్నాడు. ముఖ్యంగా పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో ఉన్న సరిహద్దుల్లోని పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలను సందర్శిస్తూ అక్కడ శిక్షణ పొందుతున్న వారికి భారత్‌పై ప్రతీకార పాఠాలను నూరిపోస్తున్నాడు. 'భారత్‌లో విరివిగా దాడులకు పాల్పడండి' అంటూ తాజాగా పిలుపునిచ్చాడు. ఈ తరహా ప్రసంగం పాక్ భద్రతా దళాల దన్నుతోనే చేస్తుండటం గమనార్హం. 
 
అందువల్లే ఇటీవల భారత సైనిక స్థావరాలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆరోపిస్తోంది. పాకిస్థాన్‌లోని సియాల్ కోట్ సమీపంలోని సరిహద్దు వద్ద అతడు ఉగ్రవాదులను ఉద్దేశించి ప్రసంగించినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ రాకేశ్ శర్మ్ మీడియాకు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments