Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులకు ఉంగరాలు మార్చి పెళ్లి జరిపించిన ఎలుగుబంటి... ఎక్కడ?

ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన అన్యోన్య బంధమే పెళ్లి. స్పష్టంగా చెప్పాలంటే పెళ్లనేది భాగస్వాముల మధ్య ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం ఏర్పడేందుకు పునాది. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (12:55 IST)
ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన అన్యోన్య బంధమే పెళ్లి. స్పష్టంగా చెప్పాలంటే పెళ్లనేది భాగస్వాముల మధ్య ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం ఏర్పడేందుకు పునాది. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిపై మరొకరు ఆధారపడి షరతులు లేని ప్రేమాభిమానాలతో సాగిపోయే జీవితానికి ఆహ్వానం పలికే ఒక మధురమైన ఘట్టం. అటువంటి పెళ్లిని ఎవరి ఆచార సంప్రదాయాల ప్రకారం వారు చేసుకుంటారు. చర్చి ఫాదర్‌.. పురోహితుడు.. మత పెద్ద.. రిజిస్టర్‌ మ్యారేజీ ఇలా వారి ఇష్టా యిష్టాలను బట్టి పెద్దలు వివాహం జరిపిస్తారు. 
 
కానీ రష్యా రాజధాని మాస్కోకి చెందిన ఓ ప్రేమ జంట మాత్రం పెళ్లి పెద్దగా ఓ ఎలుగుబంటిని ఎంచుకున్నారు. మాస్కోకి చెందిన డెనిస్‌, నెల్యాలు కొద్ది రోజులుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం వివాహచేసుకుంటే అందులో మజాయేముంది అనుకున్నారో ఏమో కానీ ఈ ప్రేమికులు స్టీఫెన్‌ అనే ఎలుగుబంటిని తెప్పించుకుని దాని ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఎలుగుబంటిని అలంకరించి నల్ల టై కూడా కట్టారు. 
 
ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటుంటే పెళ్లి పెద్ద ఎలుగుబంటి ఇద్దరి చేతులు పట్టుకుని దగ్గరుండి ఈ వేడుక జరిపించింది. కాస్త డిఫరెంటుగా పెళ్లి చేసుకోవాలని భావించారేమోగాని ఎలుగుబంటిని తీసుకొచ్చి దానిముందు పెళ్లి చేసుకున్నారు. క్రూర జంతువైనా... అది మాత్రం పెంపుడు జంతువులా ఎంతో ప్రేమగా ఉందని డెసిన్‌ చెప్పాడు. వివాహ వేడుక ముగిశాక.. స్టీఫెన్‌ ఇద్దరికీ బొకేలు ఇచ్చి వారిద్దరితో ఫొటోలు కూడా తీయించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments