Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు: ఇద్దరు మృతి.. ఐఎండీ ఎలెర్ట్

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (15:20 IST)
heavy rain
భారీ వర్షాల కారణంగా కోల్‌కతాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వరదల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం కూడా జలమయమైంది. ఎయిర్‌పోర్టు రన్‌వే, ట్యాక్సీవే దాదాపు 2 అడుగుల ఎత్తు వరకు జలమయమయ్యాయి. దీంతో ఇక్కడి నుంచి విమానాలు నడపడంలో సమస్య ఏర్పడింది.
 
దీంతో విమానాశ్రయంలో చేరిన వరద నీటిని తొలగించే పనిలో విమానాశ్రయ సిబ్బంది నిమగ్నమయ్యారు. అదేవిధంగా హౌరా, పశ్చిమ బర్ధమాన్, బిర్బమ్, తూర్పు బర్ధమాన్, హుగ్లీ, నదియా, నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో కూడా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

తర్వాతి కథనం
Show comments