Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వ్యాక్సిన్‌ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ : రష్యా ఆరోగ్య శాఖ

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (11:40 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా అనేక ప్రపంచ దేశాలు వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే, దాని వల్ల దుష్ప్రభావాలు వచ్చాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
 
మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్‌ తాము ఊహించినవేనని ఆయన అన్నారు. అవి సాధారణంగా ఒకటిన్నర రోజుల్లో పోతాయని తెలిపారు.
 
కాగా.. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించకుండానే రష్యా స్ఫూత్నిక్-వీని విడుదల చేయడంతో అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీకాను పరీక్షించే ప్రక్రియ పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ ఎలా విడుదల చేస్తారని శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు.
 
ఇదిలావుంటే, తమ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఇటీవలే తెలిపింది. దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు వేశారు. 
 
త్వరలోనే వారికి రెండో ‌ డోసును వేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఒక వేళ అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments