Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను ముక్కలు ముక్కలుగా నరికి.. ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టారు.. ఎందుకని?

థాయ్‌లాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళను నరికి ఆ ముక్కలను నల్లటి కవర్లలో ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచన ఘటన కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... థాయిలాండ్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అరె

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:16 IST)
థాయ్‌లాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళను నరికి ఆ ముక్కలను నల్లటి కవర్లలో ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచన ఘటన కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... థాయిలాండ్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. అయితే వారి కంటపడిన ఓ దృశ్యం ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేసింది. ఒక మహిళను ముక్కలు ముక్కలుగా నరికి నల్లటి కవర్లలో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో భద్రపర్చారు. 
 
తొలుత ఓ ఐదంతుస్తుల భవనంలో ఉన్న 63 యేళ్ల బ్రిటిష్ వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో పోలీసుల మధ్యలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం బ్రిటిష్ వ్యక్తితో పాటు ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు బర్మావాసులను అరెస్టు చేశారు. వారి స్థావరంలో భారీగా తుపాకులు, నకిలీ పాస్ పోర్టులను, మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
భవనంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బేస్‌మెంట్‌లో కనిపించిన దృశ్యం భయభ్రాంతులకు గురిచేసింది. ఓ మహిళను ఐదు ముక్కలుగా నరికి ఆ భాగాలకు నల్లటి కవర్లో ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపర్చారు. ఇలా దారుణ హత్యకు గురైన మహిళ ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments