Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు

Webdunia
హిందూ, ఫసిఫిక్ మహాసముద్రాల్లో కొన్ని గంటల క్రితం రెండు భూకంపాలు సంభవించాయి. హిందూ మహాసముద్రంలో భూకంపం కారణంగా మొదట అధికారిక యంత్రాంగం దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.

హిందూ మహాసముద్రంలో సంభవించిన మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదయింది. జపాన్ తీరంలోని ఫసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదయినట్లు డెన్వెర్‌లోని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో అండమాన్ ద్వీపాలకు ఉత్తరంగా 262 కిలోమీటర్ల దూరంలో మొదటి భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మంగళవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం కారణంగా ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని గంటల తరువాత దీనిని రద్దు చేశారు. ఫసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండు భూకంపం కేంద్రాన్ని టోక్యోకు నైరుతీ దిశగా 170 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీని కారణంగా సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments