Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు సమన్లను ముషారఫ్ బేఖాతరు

Webdunia
పాకిస్థాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లను బేఖాతరు చేశారు. దేశంలో రెండేళ్ల క్రితం అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడంతోపాటు, న్యాయమూర్తులను తొలగిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముషారఫ్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సమన్లను మాజీ అధ్యక్షుడు ముషారఫ్ బేఖాతరు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి నేతృత్వంలోని 14 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం కోర్టు ఎదుట హాజరుకావాలని ముషారఫ్‌కు నోటీసు జారీ చేసింది. అయితే బుధవారం జరిగిన విచారణకు ముషారఫ్ లేదా అతని తరపు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు.

ముషారఫ్ తరపున వాదించేందుకు కోర్టుకు ఎవరైనా వచ్చారా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు నిశ్శబ్దమే సమాధానమైంది. ముషారఫ్ హయాంలో ప్రభుత్వం అటార్నీ జనరల్‌గా పనిచేసిన మాలిక్ ఖయ్యుం కూడా విచారణ సమయంలో కోర్టులోనే ఉన్నారు. అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. ముషారఫ్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

Show comments