Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగ్-గిలానీల భేటీ: ఊసేలేని ముంబై దాడులు

Webdunia
గురువారం, 16 జులై 2009 (20:31 IST)
FileFILE
భారత్-పాకిస్థాన్ దేశాల ప్రధానులు గురువారం ఈజిప్టులో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ముంబై దాడుల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే.. భారత్ ఒక మెట్టు దిగి.. కీలకమైన ముంబై పేలుళ్ళ ప్రస్తావనే లేకుండా గిలానీతో ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చలు జరిపారు. దీనితో కేవలం ద్వైపాక్షిక సంబంధాల ఎజెండాతోనే ఇరువురు ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి.

సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ చర్చలో పలు ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరు చర్చించారు. అనంతరం ఇరువురు ప్రధానులు మీడియా ముందుకు వచ్చారు. ఇరుదేశాలకు ఉగ్రవాదం ప్రధాన శత్రువని ఉమ్మడి ప్రకటన చేసి సరిపుచ్చుకున్నారు. ముంబై పేలుళ్ళ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆ అంశాన్ని కాస్త పక్కన పెట్టాలని పాక్ పదే పదే చేసిన ప్రతిపాదనకు భారత్ మెత్తబడినట్టు తెలుస్తోంది.

అంతకుముందే గిలానీ ప్రతిపాదనను ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ బషీర్‌, ఎస్‌.ఎం.కృష్ణను కలిసి చర్చించగా, మన్మోహన్‌ను సంప్రదించి కృష్ణ ఇందుకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మన్మోహన్‌, గిలానీ కలిసి చర్చలు ప్రారంభించారు. ఈ సమావేశానికి ముందు భారత్-పాక్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments