Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంలో కోత విధించడం వ్యతిరేక సంకేతం: జర్దారీ

Webdunia
పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చే సాయంలో కోత విధిస్తే ఇప్పటికే ఆర్ధిక ఇప్పందుల్లో ఉన్న తమ దేశంలో అమెరికా పట్ల వ్యతిరేక భావన హెచ్చుమీరే అవకాశం ఉందని ఇస్లామాబాద్ పేర్కొంది.

" సాయంలో కోత ప్రస్తుతం ఉన్న మా ఆర్ధిక పరిస్థితులపై మాత్రమే ప్రభావం చూపకుండా అమెరికా ప్రభుత్వం పట్ల పాకిస్థాన్ ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది" అని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తమ దేశ పర్యటనకు వచ్చిన అమెరికా సెనెట్ ప్రతినిధుల బృందంతో పేర్కొన్నారు. పాకిస్థాన్‌కి ఇచ్చే సాయంలో కోత విధించకుండా అమెరికా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటారని జర్దారీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని పాకిస్థాన్‌కు వచ్చిన సెనేటర్లు పాక్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ, సైన్యాధ్యక్షుడు అస్ఫక్ పర్వేజ్ కయానీలతో కూడా భేటీ అయినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. పాకిస్థాన్‌కు అందించే పౌర సాయంలో కోతకు సంబంధించిన బిల్లును అమెరికా పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ గత నెలలో ఆమోదించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments