Webdunia - Bharat's app for daily news and videos

Install App

సయీద్ కేసు: వాయిదా వేయాలని కోరిన పాక్

Webdunia
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ నిర్బంధం కేసును వారంపాటు వాయిదా వేయాలని ఆ దేశ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాని నిందితుడిగా భావిస్తున్న సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణను వారంపాటు వాయిదా వేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును కోరింది.

సయీద్ కేసులో బలమైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో లాహోర్ హైకోర్టు అతడిని గత నెల 2న గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాహోర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పాక్ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి, సయీద్‌ను నిర్బంధంలో ఉంచేందుకు బలమైన ఆధారాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలను ఆదేశించింది.

సరైన ఆధారాలు లేకపోవడంతో పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పంజాబ్ ప్రావీన్స్ పిటిషన్ ఉపసంహరణ కూడా నిలిచిపోయింది. పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది "సయీద్ కేసు"ను వారంపాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments