Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక జట్టుపై దాడి చేసిన తీవ్రవాది అరెస్ట్

Webdunia
శ్రీలంక జట్టుపై లాహోర్‌లో దాడి చేసిన ఓ తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం బుధవారం వెల్లడించింది. పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టును లక్ష్యంగా చేసుకొని కొన్ని నెలల క్రితం లాహోర్‌లో కొందరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిలో శ్రీలంక జట్టు సభ్యులు కొందరు గాయపడ్డారు.

వారికి రక్షణగా ఉన్న ఏడుగురు పోలీసులు మృతి చెందారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఓ తీవ్రవాదిని తాజాగా పాక్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చి 3న శ్రీలంక జట్టుపై జరిగిన దాడికి బైతుల్లా మెహసూద్ నేతృత్వంలోని తాలిబాన్ తీవ్రవాద గ్రూపు కారణమని ఈ సందర్భంగా పాక్ అధికారులు ఆరోపించారు.

అరెస్టు చేసిన తీవ్రవాదిని జుబైర్ అలియాస్ నెక్ మొహమ్మద్‌గా గుర్తించారు. పంజాబీ తాలిబాన్ తీవ్రవాదులు ఈ దాడి చేశారని లాహోర్ పోలీసు చీఫ్ పర్వేజ్ రాథోడ్ బుధవారం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మెహసూద్ నేతృత్వంలోని తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపు అనుబంధ సంస్థ ఈ దాడి చేసిందని పేర్కొన్నారు. జుబైర్, మరో ఆరుగురు తీవ్రవాదులు కలిసి శ్రీలంక జట్టుపై దాడికి పాల్పడ్డారని, వీరందరూ పంజాబీ తాలిబాన్ గ్రూపుకు చెందినవారేనని రాథోడ్ తెలిపారు. అఖీల్ అలియాస్ అర్‌స్లాన్ అలియాస్ డాక్టర్ ఉస్మాన్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని జుబైర్ పోలీసులకు చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments