Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులు, ఉపాధ్యాయులను విడిచిపెట్టిన తాలిబాన్లు

Webdunia
పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతున్న కాడెట్ కళాశాల నుంచి కిడ్నాప్ చేసిన కొందరు విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్ తీవ్రవాదులు గురువారం వదిలిపెట్టారు. పాక్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతంలో ఇటీవల కాడెట్ కళాశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారు.

వీరిలో 80 మంది విద్యార్థులు, సిబ్బందిని ఇప్పటికే పాక్ ఆర్మీ విడిపించింది. తాజాగా 46 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను తాలిబాన్లు వారంతటవారే వదిలిపెట్టారు. గిరిజన పెద్దల జోక్యంతో తాలిబాన్లు విద్యార్థులను వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనను దృష్టిలో ఉంచుకొని వారిని విడిచిపెట్టినట్లు తాలిబాన్ ప్రతినిధులు తెలిపారు.

గిరిజన పెద్దల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని విద్యార్థులను వదిలిపెడుతున్నట్లు తాలిబాన్ కమాండర్ బైతుల్లా మెహసూద్ ముఖ్య సహాయకుడు హాకీముల్లా మెహసూద్ పేర్కొన్నాడు. వజీరిస్థాన్ ప్రాంతంలోని రాజ్‌మక్ కాడెట్ కళాశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్లు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. ఈ కళాశాలలో భవిష్యత్ ఆర్మీ అధికారులను తయారు చేస్తారు. వీరిని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో తాలిబాన్లు విడుదల చేస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments