Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడెన్ పేరిట టేపు విడుదల: ఇంటెల్ సెంటర్

Webdunia
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ మృతి చెందాడా లేక జీవించి ఉన్నాడా అనేదానిపై పలు అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఓ కొత్త టేపు విడుదలైంది. దీనిని అల్‌ఖైదా తరపున అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగం ఉంది. ఇందులో ప్రసంగించిన వ్యక్తి గొంతు లాడెన్‌దేనని అల్‌ఖైదా ప్రకటించింది.

2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన మారణకాండ 2009తో ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన రెండు రోజుల తర్వాత అల్‌ఖైదా విడుదల చేసిన ఈ టేపులో లాడెన్ చిత్రంతోపాటు ఓ ఆడియోకూడా ఉండటం గమనార్హం.

అల్‌ఖైదాకు చెందిన మీడియా విభాగానికి చెందిన అస్ సాహెబ్ ద్వారా ఈ టేపు విడుదల చేసినట్లు అమెరికాలో ఉగ్రవాదంపై దృష్టి సారించిన ఇంటెల్ సెంటర్ ఆదివారం తెలిపింది.

అల్‌ఖైదా విడుదల చేసిన ఈ వీడియో టేపులో లాడెన్‌కు చెందిన ఓ చిత్రం మరియు ఆయన ప్రసంగం అందులో ఉందని ఇంటెల్ పేర్కొంది. ఇందులో ఎలాంటి వీడియోలుకాని వేరే ఇతర సామగ్రికాని లేదని ఆ సంస్థ పేర్కొంది.

ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో విడుదల చేసే వీడియోటేపులాంటిదేనని సంస్థ ప్రకటించింది. దీనికి ముందు లాడెన్ పేరిట వచ్చిన చివరి ఆడియో టేపు జూన్ నెల మూడవ తేదీన విడుదలైనట్లు ఇంటెల్ సెంటర్ తెలిపింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments