Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధం

Webdunia
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి గత మూడు దశాబ్దాలుగా ఎల్టీటీఈ తీవ్రవాద గ్రూపు పోరాటం జరిపిన సంగతి తెలిసిందే.

ఎన్నో ఏళ్లపాటు ఎల్టీటీఈ ఆధీనంలో ఉండి, ప్రభుత్వ పాలనకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ తిరుగుబాటును శ్రీలంక సైన్యం పూర్తిగా అణిచివేసిన సంగతి తెలిసిందే.

సమస్యాత్మక ఉత్తర ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రధాన నగరాల్లో శనివారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు శ్రీలంక ప్రభుత్వం మీడియాను అనుమతించడం లేదు.

వావూనియా, జాఫ్నా నగరాల్లోకి విలేకరులకు ప్రవేశం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 25 ఏళ్ల పౌర యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన ఈ రెండు నగరాల్లో శనివారం జరిగే స్థానిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బీజాలు పడనున్నాయి.

ఈ ఎన్నికల సందర్భంగా మీడియాపై నిషేధం విధించడానికి ప్రభుత్వం ఎటువంటి కారణం వెల్లడించలేదు. భద్రతాపరమైన కారణాల వలన ఇతరులెవరినీ ఈ ప్రాంతంలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం చెబుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments