Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రా" తీవ్రవాద చర్యల ఆధారాలు పంపిన పాక్

Webdunia
రీసెచ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ- రా) తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించిందనేందుకు సంబంధించిన ఆధారాలను భారతదేశానికి పంపించామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

లాహోర్‌లో ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి, నగర శివారుల్లోని పోలీసు అకాడమీపై జరిగిన దాడితో సహా తమ దేశంలో వివిధ తీవ్రవాద చర్యల్లో భారత్‌కు చెందిన విదేశీ గూఢచర్య సంస్థ "రా" ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాల్లో "రా" ప్రమేయం ఉందనేందుకు కావాల్సిన ఆధారాలను తాము భారత ప్రభుత్వానికి అందజేశామని పాక్ తెలిపింది. పాక్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాలతో డాన్ అనే పత్రిక ఈ మేరకు ఓ కథనం వెల్లడించింది.

ఇటీవల ఈజిప్టు పర్యటనలో ఇరుదేశాల ప్రధానులు సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ తమ దేశంలో జరిగిన తీవ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉందనే వాదనను బలపరిచే ఆధారాలను భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందజేసినట్లు డాన్ వెల్లడించింది. ఈ ఆధారాలను తాము ఆమెరికా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలతోనూ పంచుకున్నామని పాక్ అధికారులు డాన్‌తో చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

Show comments