Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా గస్తీలపై ఆందోళన అనవసరం: పెంటగాన్

Webdunia
అమెరికా తీర్పు తీరంలో రష్యా జలాంతర్గాములు గస్తీ నిర్వహిస్తుండటంపై అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయ (పెంటగాన్) ప్రతినిధులు స్పందించారు. వాటి నుంచి అమెరికాకు వచ్చిన ముప్పేమీ లేదని పెంటగాన్ పేర్కొంది. వాటి విషయంలో తామేమీ ఆందోళన చెందడం లేదని స్పష్టం చేసింది.

అవి అంతర్జాతీయ జలాల్లోనే గస్తీ నిర్వహిస్తున్నాయి. అవి అక్కడ ఉన్నంతవరకు తామేమీ ఆందోళన పడబోము. వాస్తవానికి తాము కూడా అంతర్జాతీయ జలాలను ఇలాగే ఉపయోగించుకుంటున్నాము. అంతర్జాతీయ జలాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకున్నంత వరకు రష్యా జలాంతర్గాముల గస్తీపై అమెరికా ఆందోళన పడబోదని పెంటగాన్ వర్గాలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ జలాల్లో ఉండేందుకు వారికి స్వేచ్ఛ ఉంది. అమెరికా జలాంతర్గాములు కూడా రష్యా తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తుంటాయని పెంటగాన్ మీడియా కార్యదర్శి జెఫ్ మోరెల్ తెలిపారు. అమెరికా తీరానికి సమీపంలో రెండు రష్యా జలాంతర్గాములు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక బహిర్గతం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments