Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణావసరాలకు అమెరికా నిధులు: ముషారఫ్

Webdunia
అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు అందజేసిన ఆర్థిక సాయాన్ని రక్షణావసరాలకు మళ్లించామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. తీవ్రవాదంపై పోరు కోసం అమెరికా ప్రభుత్వం పాక్‌కు భారీగా ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

అయితే పాక్ ఈ నిధులను భారత్‌‍కు పోటీగా ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగించిందని గతంలో అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా తీవ్రవాదంపై పోరుకు ఉద్దేశించిన అమెరికా మిలిటరీ ఆర్థిక సాయాన్ని పాకిస్థాన్ రక్షణావసరాలకు ఉపయోగించిందని ముషారఫ్ వెల్లడించారు.

పాకిస్థాన్ అత్యున్నత పదవిని అలకరించిన వ్యక్తులు ఈ విషయాన్ని ధృవీకరించడం ఇదే తొలిసారి. భారత్‌కు పోటీగా ఆయుధాలు అభివృద్ధి చేసేందుకు అమెరికా సాయాన్ని ఉపయోగించామని ముషారఫ్ అంగీకరించడంతో.. మిలిటరీ సాయానికి సంబంధించిన అమెరికా నిబంధలను పాక్ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు స్పష్టమయింది.

పాకిస్థాన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఓ టీవీ ఛానల్‌‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ చెప్పారు. పాక్ ప్రభుత్వం ఆర్థిక సాయం నిబంధనలను ఉల్లంఘించడంపై అమెరికా యంత్రాంగం ఇప్పుడు ఆగ్రహం చెందినా తానేమీ ఖాతరు చేయబోనన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments