Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహసూద్ బతికే ఉన్నాడు: తాలిబాన్లు

Webdunia
పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్, అతని ముఖ్య అనుచరుడు బతికే ఉన్నారని ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి. తాలిబాన్ ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో బైతుల్లా మెహసూద్ సన్నిహితుడు హకీముల్లా మెహసూద్ మృతి చెందినట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం భావిస్తోంది.

అంతకుముందు అమెరికా డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ కూడా మృతి చెందాడని పాక్ యంత్రాంగం తెలిపింది. అయితే హకీముల్లా మెహసూద్ తాను, మెహసూద్ ఇద్దరం బతికే ఉన్నామని సోమవారం వెల్లడించాడు. ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి హకీముల్లా మెహసూద్ వార్తాసంస్థలకు ఈ విషయాన్ని తెలియజేశాడు.

గత బుధవారం దక్షిణ వజీరిస్థాన్‌లోని తన మామ ఇంటిలో ఉన్న బైతుల్లా మెహసూద్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో బైతుల్లా మెహసూద్, అతని భార్య, మరో ఏడుగురు సహాయకులు మృతి చెందినట్లు తాము భావిస్తున్నామని పాకిస్థాన్, అమెరికా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే హకీముల్లా వార్తా సంస్థలతో మేమిరువరం బతికే ఉన్నామని చెప్పడంతో గందరగోళం నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments